తెలంగాణ

telangana

ETV Bharat / state

గుట్కా పొట్లాలు దహనం.. గ్రామస్థులకు గాయిద్​పల్లి సర్పంచ్​ అవగాహన

నిర్మల్ జిల్లా గాయిద్ పల్లి గ్రామంలో సర్పంచ్ రాథోడ్ రాందాస్ ఆధ్వర్యంలో గుట్కా పొట్లాలను దహనం చేశారు. పొగాకు, గుట్కా తినడం వలన జరిగే అనర్థాలను గ్రామస్థులకు తెలియజేశారు.

gutka packets burned at garidepally in nirmal district
గుట్కా పొట్లాలు దహనం.. గ్రామస్థులకు గాయిద్​పల్లి సర్పంచ్​ అవగాహన

By

Published : Sep 13, 2020, 3:44 PM IST

గుట్కా, పొగాకు నమలడానికి అలవాటు పడిన వారు క్యాన్సర్ బారినపడి జీవితాన్ని ముగించేసుకుంటున్నారని నిర్మల్​ జిల్లా మామడ మండలం గాయిద్​ పల్లి గ్రామ సర్పంచ్​ రాథోడ్​ రాందాస్​ తెలిపారు. గ్రామంలోని దుకాణాల్లో గుట్కా, పొగాకు విక్రయించవద్దని సూచించారు. గుట్కా పొట్లాలను దహనం చేశారు.

గ్రామస్థులందరూ గుట్కాపొట్లాలను నిషేధించేందుకు సహకరించాలని కోరారు. ఆరోగ్య రక్షణకై అందరూ బాధ్యతగా ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజేష్, వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

ABOUT THE AUTHOR

...view details