తెలంగాణ

telangana

తుపాకీ మిస్​ఫైర్.. హెడ్​ కానిస్టేబుల్​కు గాయాలు

By

Published : Jun 7, 2020, 11:15 AM IST

Published : Jun 7, 2020, 11:15 AM IST

Updated : Jun 7, 2020, 5:47 PM IST

gun-miss-fire-at-nirmal
తుపాకీ మిస్​ఫైర్.. హెడ్​ కానిస్టేబుల్​కు గాయాలు

11:12 June 07

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మిస్​ఫైర్​

నిర్మల్​లోని హెడ్​ క్వార్టర్స్​లో ఏఆర్ హెడ్​ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న శంకర్ గౌడ్.. ఉదయం తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలింది. తూటా శంకర్ గౌడ్ చంక భాగం నుంచి దూసుకెళ్లింది. వెంటనే అతడ్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.   

అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్పీ శశిధర్​రాజు ఆసుపత్రికి చేరుకొని.. శంకర్​గౌడ్​ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కానిస్టేబుల్ నిర్మల్ జిల్లా ఖానాపూర్​కు చెందిన వ్యక్తి. 

ఇవీ చూడండి:రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

Last Updated : Jun 7, 2020, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details