తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: జాక్టో - నిర్మల్ జిల్లా లేటెస్ట్ న్యూస్

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపట్టారు. పాఠశాలల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. బదిలీలు నిర్వహించి... పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

government teachers protest at nirmal collectorate
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: జాక్టో, యూఎస్​పీసీ

By

Published : Dec 17, 2020, 4:27 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు నష్టపోతున్నారని ఉపాధ్యాయ సంఘ నాయకులు అన్నారు. పాఠశాలల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్​పీసీ) ఆధ్యర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు.

ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించి... పదోన్నతులు కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్​లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జుట్టు గజేందర్, భూమన్న యాదవ్, దాసరి శంకర్, ముస్తాక్ బేగ్, మధుసూధన్, ధర్మాజీ చందనే, రాజేశ్ నాయక్, మహేంద్ర చారి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు : ఉపాధ్యాయుల ఐకాస

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details