జ్ఞాన సరస్వతి సన్నిధిలో కె.వి.రమణాచారి - జ్ఞాన సరస్వతి సన్నిధిలో కె.వి.రమణాచారి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి దర్శించుకున్నారు. వేదపండితులు ఆయనకు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.
జ్ఞాన సరస్వతి సన్నిధిలో కె.వి.రమణాచారి
ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి కుటుంబ సమేతంగా బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయానికి కేటాయించిన 50 కోట్ల నిధులను పునరుద్ధరణకు వినియోగించి, త్వరలోనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. నిత్యం వేలమంది భక్తులు దర్శించుకునే అమ్మవారి ఆలయ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి : 'హల్వా' ఉత్సవంలో కేంద్ర ఆర్థిక మంత్రి