లాక్‌డౌన్ వేళ ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు ఆపన్నహస్తం అందించారు నిర్మల్ జిల్లా కడ్తాల్ గ్రామ యువకులు. కాలినడకగా వెళ్తోన్న 200 మందికి ఆహారం అందించి దాతృత్వం చాటుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయి సొంత రాష్ట్రాలకు కాలినడకన వెళ్తోన్న వలస కూలీలకు అండగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు యువకులు తెలిపారు.
ఆపద వేళ వలస కూలీల ఆకలి తీరుస్తున్న యువకులు - LOCK DOWN PROBLEMS
కాలినడకన స్వరాష్ట్రానికి పయనమైన వలస కూలీలకు నిర్మల్ జిల్లా కడ్తాల్ గ్రామ యువకులు అన్నదానం చేశారు. సుమారు 200 మందికి భోజనం పెట్టి పలువురి ప్రశంసలు పొందుతున్నారు.
ఆపద వేళ వలస కూలీల ఆకలి తీరుస్తున్న యువకులు
ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని వైస్ ఎంపీపీ నరేశ్ కోరారు. అన్నదానంతో కూలీల ఆకలి తీరుస్తున్న గ్రామ యువతను పలువురు ప్రశంసిస్తున్నారు.