నిర్మల్ జిల్లా కొండాపూర్ - భాగ్యనగర్ సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న 14 మంది వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపిచాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పుర్కు పంపించేందుకు అధికారులు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, పోలీసులు దగ్గరుండి వారిని తరలించారు.
స్వస్థలాలకు గాయపడిన వలస కార్మికుల తరలింపు - ప్రత్యేక వాహనంలో గాయపడిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారు
నిర్మల్ జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వలస కార్మికులను... ప్రత్యేక వాహనంలో వారి స్వస్థలాలకు తరలించారు.
NIRMAL DISTRICT LATEST NEWS
నిన్నటి ప్రమాదంలో 25 మందికి గాయాలు కాగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 14 మందికి స్వల్పంగా గాయలుకావడం వల్ల వారిని గోరఖ్పుర్ పంపించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. మిగితా 9 మందికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉండటం వల్ల.. వారికి చికిత్స పూర్తి చేసి మరో మూడు రోజుల్లో పంపించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.