నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని 1వ వార్డులో నీటి సమస్య ఉండటం వల్ల కాలనీవాసులు బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ధర్నా చేశారు. 1వ వార్డులో గత కొన్ని రోజులుగా నీటి సమస్య బాగా ఉందని నాయకులకు, అధికారులకు తెలిపినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. సర్పంచ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్పంచ్ ఘటనాస్థలానికి చేరుకుని తాగునీటి సమస్యలను తీరుస్తానని హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు.
ముథోల్‌లో మంచినీటికై స్థానికుల ధర్నా... - Drinking water problem in Mudhol
నిర్మల్ జిల్లా ముథోల్‌లో 1వ వార్డులో తాగునీటి కోసం స్థానికులు ధర్నా చేపట్టారు. సర్పంచ్ హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించారు.
ముథోల్‌లో మంచినీటికై స్థానికుల ధర్నా...