మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలకు ధైర్యాన్ని, నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు తనిఖీలు ఉపయోగపడతాయని... నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో భైంసా మండల పరిధిలోని మహాగాంవ్ గ్రామంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.
'నేరాల పట్ల అవగాహన కల్పించేందుకే నిర్బంధ తనిఖీలు'
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహాగాంవ్ గ్రామంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 117 ద్విచక్ర వాహనాలు, 8 ట్రాక్టర్, 4 ఆటోలు, ఒక కారుతో పాటు... రూ 20 వేల వరకు విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
భైంసా మండలంలో నిర్బంధ తనిఖీలు
తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 117 ద్విచక్ర వాహనాలు, 8 ట్రాక్టర్, 4 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటితో పాటు రూ.20 వేల వరకు విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.