కర్ణాటక తాత... శాంతియుతంగా సైకిల్ యాత్ర - nagaraj goud
కారణమేదైనా సాటివారితో పోట్లాడటం సరికాదు.. అందరూ కలిసికట్టుగా జీవిద్దాం... మనం బతుకుతూ ఇతరులను బతుకనిద్దాం... అంటూ కర్ణాటకకు చెందిన నాగరాజ్ గౌడ్ అనే వృద్ధుడు సైకిల్ యాత్ర చేస్తున్నాడు.
సైకిల్ యాత్ర
కర్ణాటకకు చెందిన నాగరాజ్ గౌడ్ డిసెంబర్ 30, 2017వ సంవత్సరంలో ముంబై నుంచి ప్రపంచ శాంతి యాత్ర పేరుతో సైకిల్ యాత్రను ప్రారంభించాడు. ఈ యాత్ర నిన్నటికల్లా నిర్మల్ చేరుకుంది. సర్వధర్మ సమభావం పెంపొందించేందుకే ఈ యాత్రను చేపట్టినట్లు నాగరాజ్ గౌడ్ తెలిపారు. ప్రతిరోజు 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం వెళ్తున్నట్లు వెల్లడించారు. దారిపొడవునా స్థానికులను కలుసుకుంటూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నట్లు నాగరాజ్ పేర్కొన్నారు.