నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్ల వాన వల్ల నష్టపోయామని రైతులు వాపోయారు. ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కోరారు. జాం గ్రామంలో దెబ్బతిన్న వరిని ఆదివారం పరిశీలించారు.
అకాల వర్షంతో పంట నీటిపాలు..
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అకాల వర్షాలతో కోతకొచ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్ల వానతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ కోరారు.
అకాల వర్షాలతో పంట నష్టం, సారంగపూర్‌లో అకాల వర్షాలు
వడగండ్ల వానతో కోతకొచ్చిన పంట నేలపాలైందని ఆయన అన్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు రావుల రాంనాథ్, మండల అధ్యక్షుడు కరిపే విలాస్, తిరుమల చారి, రాజ్ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అంబులెన్స్‌లో మంటలు- గర్భిణీ సజీవదహనం