ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా రూ. 3016 నిరుద్యోగ భృతి హామీని సీఎం కేసీఆర్ అమలు చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. నిరుద్యోగ భృతి అందిస్తానని చెప్పి విస్మరించారని కాంగ్రెస్ నేతలు అన్నారు. రెండో సారి తెరాస ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా హామీ నెరవేర్చడంలో చిత్తశుద్ధి కనబర్చడం లేదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగం, ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలి' - CONGRESS VINATI
నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని నిర్మల్ జిల్లాలో యువజన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు.
'నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలి'
ఉద్యోగ నోటిఫికేషన్లు చేపట్టకుండా నిరుద్యోగ యువత పట్ల మోసపూరిత మాటలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు సత్యం చంద్రకాంత్, నిర్మల్ నియోజకవర్గ అధ్యక్షులు నాందేడపు చిన్ను , నిర్మల్ మండల పార్టీ అధ్యక్షులు జమాల్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..