రెండు పడక గదుల నిర్మాణ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ షారుఖీ పరిశీలించారు. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లా మొత్తం 6601 ఇళ్లు మంజూరు కాగా అందులో నిర్మల్ నియోజకవర్గంలో 3761, ముథోల్లో 2240, ఖానాపూర్లో 600 ఇళ్లు మంజురైనాయని ఆయన తెలిపారు.
'డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరిత గతిన పూర్తిచేయండి'
నిర్మల్ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
'డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరిత గతిన పూర్తిచేయండి'
ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొత్తం ఇండ్ల టెండర్లు వెంటనే పూర్తి కావాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనులను త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.