నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత... ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో ఎన్నికైన నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.
ప్రతి ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుంది: మున్సిపల్ ఛైర్మన్
రానున్న రోజుల్లో... ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో ఇదే తరహాలో తెరాస విజయభేరి మోగిస్తుందని నిర్మల్ జిల్లా మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
ప్రతి ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుంది: మున్సిపల్ ఛైర్మన్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా పార్టీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయని మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో... జరిగే ప్రతి ఎన్నికల్లో... ఇదే తరహాలో ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. దుబ్బాక ఎన్నికల్లో తమ పార్టీ ముందు... ఇతర పార్టీలు డిపాజిట్లు కోల్పోవాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్, కౌన్సిలర్లు, రాజేశ్వర్, బిట్లింగ్ నవీన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.