నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. నేడు కుంటాల మండలం కల్లూరు గ్రామంలో 4 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. మొత్తం 4 తులాల బంగారం, 9 తులాల వెండి, 30 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 20 రోజుల క్రితం కూడా ముధోల్, భైంసా పట్టణాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు దొంగలు. ఇప్పటికైనా పోలీసులు దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.
నిర్మల్ జిల్లాలో దొంగల కలకలం - THIEVES
20 రోజుల క్రితం ముధోల్, భైంసా పట్టణాల్లో వరుస దొంగతనాలు జరిగాయి. మళ్లీ ఈ రోజు కల్లూరులోని 4 ఇండ్లలో చోరీ చేశారు గుర్తుతెలియని దుండగలు. దొంగలు ఎప్పుడు వచ్చి, ఏం దోచుకెళ్తారో తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
నిర్మల్ జిల్లాలో దొంగల కలకలం