ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదిలాబాద్ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తుంటారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన పార్టీ ఒకటుంటే... జిల్లాలో విజయం సాధించే అభ్యర్థులు మరో పార్టీలో ఉండటం సోయం బాపురావు విజయంతో మరోసారి నిరూపితమైంది. ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి పోలింగ్ వరకు ఇక్కడ పోరు త్రిముఖంగా సాగింది. తెరాస అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ గోడం నగేష్.... ప్రభుత్వ పనితీరును, సంక్షేమ పథకాలను బలంగా ప్రజల వద్దకు తీసుకెళ్లినా ఓటమి తప్పలేదు. ప్రధానంగా ఆదివాసీల సమస్యకు పరిషార్కం చూపించలేదన్న అపవాదు ఉంది. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన రమేష్ రాఠోడ్‌కు ఎన్నికల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పార్టీని వీడటం ప్రతికూలాంశంగా మారింది.
బాపురావే... ఆదిలా'బాద్'షా.... - telangana
ఉత్కంఠ భరింతగా సాగిన ఆదిలాబాద్ అడవి బిడ్డల పోరులో భాజపా అభ్యర్థి సోయం బాపురావు విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే బాపురావు ఆధిక్యం కొనసాగించారు. సమీప తెరాస అభ్యర్థి గోడం నగేష్‌పై సుమారుగా 59వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
అధికార పార్టీ అభ్యర్థి గోడం నగేష్ తోపాటు మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్‌ను ఓడించి బాపురావు చరిత్ర సృష్టించారు. సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ.. గతంలో ఎమ్మెల్యేగా, ఉద్యమ నేతగా పనిచేసిన అనుభవంతో బాపురావు పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగారు. తెరాసలోని అంతర్గత కలహాలు.. కాంగ్రెస్‌లోని సమన్వయలోపం భాజపాకు కలిసి వచ్చింది. మెుదటి నుంచి ఆదివాసీల హక్కులకోసం పోరాటం చేయటం... వివాదాలకు దూరంగా ఉండటం సోయంకు అనుకూలంగా మారింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితం పూర్తి ట్యాలీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి