2023 ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగుర వేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరుతూ... సంజయ్ చేపట్టిన యాత్ర నిర్మల్ జిల్లాకు చేరుకుంది. కొండాపూర్ బైపాస్ నుంచి వెయ్యి ఉరుల మర్రి స్మారక స్థూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుమరం భీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
'గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తాం...'
నిర్మల్ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. కొండాపూర్ బైపాస్ నుంచి వెయ్యి ఉరుల మర్రి స్మారక స్థూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కుమరం భీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
రాష్ట్రం సిద్ధిస్తే... అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్... మజ్లిస్ పార్టీకి భయపడి విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు వెనకాడుతుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ... ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హిందువుల ప్రాణత్యాగంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. బైంసా అల్లర్ల బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.