నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని జాతీయ రహదారిపై వాహన తనిఖీ నిర్వహింస్తుండగా.. ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ రఫీక్ పట్టుబడ్డాడు. అనుమానించి విచారించగా.. దొంగతనాల గురించి తెలిపాజు. ఆయా ప్రాంతాల్లో దొంగలించిన ఆరు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లాక్డౌన్లో ఉపాధి కోల్పోయి దొంగగా మారిన ఆటోడ్రైవర్ అరెస్ట్
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి దొంగతనాన్ని వృత్తిగా మలచుకుని ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఓ వ్యక్తిని నిర్మల్ జిల్లా కుంటాల పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
లాక్డౌన్లో ఉపాధి కోల్పోయి దొంగగా మారిన ఆటోడ్రైవర్ అరెస్ట్
లాక్డౌన్ నేపథ్యంలో ఆటో సరిగ్గా నడవక.. ఉపాధి కోల్పోయి జీవనం గడవుక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. రఫీక్‌కు సహకరించిన కబీర్ అనే వ్యక్తిని గాలిస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి:తహసీల్దార్ కార్యాలయంలో అన్నదమ్ముల ఆత్మహత్యాహత్నాం