తెలంగాణ

telangana

ETV Bharat / state

రాళ్ల దాడి, ఇళ్లకు నిప్పు.. డీఎస్పీతోపాటు పలువురికి గాయాలు

భైంసాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ చిన్న విషయం చిలికి చిలికి పెద్దగా మారింది. ఇరువర్గాలు మోహరించి రాళ్లు రువ్వుకున్నారు. ఇళ్లకు నిప్పుపెట్టారు. డీఎస్పీ, సీఐ, ఎస్సైసహా పలువురికి గాయాలయ్యాయి. ఎస్పీ అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

bhainsa
bhainsa

By

Published : Jan 13, 2020, 8:16 AM IST

Updated : Jan 13, 2020, 11:41 AM IST

భైంసాలో ఉద్రిక్తత..బైక్​లకు నిప్పు, పోలీసులకు గాయాలు

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఓ ద్విచక్రవాహన చోదకుడు గల్లీలో వెళ్తుండగా స్థానిక యువకులు అడ్డుకున్నారు. అది గొడవకు దారితీసింది.

ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుని, కర్రలతో దాడి చేసుకున్నారు. కొన్ని ఇళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తుండగా రాళ్ల దాడిలో భైంసా డీఎస్పీ నరసింహారావు, పట్టణ సీఐ వేణుగోపాలరావు, ముథోల్‌ ఎస్సై అశోక్‌, కొందరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

వీరితోపాటు ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల ఎస్పీ శశిధర్‌రాజు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇదీ చూడండి : 'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఏలా పెరిగాయి'

Last Updated : Jan 13, 2020, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details