చెరువులు తలపిస్తున్న భైంసా రోడ్లు - చెరువులు తలపిస్తున్న భైంసా రోడ్లు
భైంసాలో భారీ వర్షం కురిసి రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చెరువులు తలపిస్తున్న భైంసా రోడ్లు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంతో పాటు డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. పట్టణ కేంద్రంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వదర నీరంతా రోడ్లపై నిలిచి చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.