నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది అందాలను చూసి బాసర క్షేత్రానికి వచ్చే భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం అమాంతం పెరిగి జలకళ సంతరించుకుంది. బాసరకు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు గోదావరి నదిలో కలుస్తోంది. నీటి ప్రవాహం అంతకంతకు పెరిగి వరద నీరు బాసర మీదుగా దిగువన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తోంది.
గోదారమ్మ అందాలు చూడతరమా! - heavy flow in godavari
నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నదిలో నీటిమట్టం అమాంతం పెరిగి జలకళ సంతరించుకుంది. క్షేత్రానికి వచ్చే భక్తులు గోదారమ్మ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గోదారమ్మ అందాలు చూడతరమా!