తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదారి కలుషితం... ఆల్కాహాల్ కర్మాగారం నిర్వాహకం - గోదావరిని కలుషితం చేస్తోన్న ఆల్కహాల్ వ్యర్థాలు

ఆల్కాహాల్ కంపెనీ వ్యర్థాలతో గోదారమ్మ కలుషితమవుతోంది. తాగునీటి కలుషితంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. బాసరలోని భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

గోదావరిని కలుషితం చేస్తోన్న ఆల్కహాల్ వ్యర్థాలు

By

Published : Sep 2, 2019, 10:59 AM IST

గోదావరిని కలుషితం చేస్తోన్న ఆల్కహాల్ వ్యర్థాలు

నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరికి వరద ప్రవాహం జలకళను తీసుకొచ్చింది. ఈ ప్రవాహం మాటున మహారాష్ట్ర ధర్నాబాద్ పట్టణ సమీపంలోని ఆల్కహాల్ కర్మాగారం.. నదిలోకి వ్యర్థాలను వదులుతోంది. సంవత్సరంపాటు కర్మాగారంలో నిల్వ చేసిన వ్యర్థలను వరద వచ్చే సమయంలో విడుదల చేయడంతో గోదావరి కలుషితమవుతోంది. గతంలో సైతం నదిలోకి రసాయనాలను వదిలి మత్స్యసంపదకు భారీగా నష్టం వాటిల్లేలా చేసిన యాజమాన్యం... తాజాగా ఆదివారం మరోసారి విడుదల చేసింది. ఈ వ్యర్థాలు బాసరలోని తాగునీటి పథకాల వద్ద పోగై నీరు దుర్వాసన వస్తోంది. గోదావరిలో స్నానాలు ఆచరించాలనుకున్న భక్తులు కలుషిత జలాలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ సమస్య తలెత్తుతున్నా పరిష్కరించటంలో ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు విఫలమవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details