తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​పై ఆదివాసీల కన్నెర్ర.. - PROTEST

లంబాడాలను ఎస్టీ బాబితా నుండి తొలగించాలంటూ నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద గురువారం ఆదివాసీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. లంబాడాలు ఎస్టీ జాబితాలోనే కొనసాగుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​పై ఆదివాసీల కన్నెర్ర..

By

Published : Sep 6, 2019, 12:50 PM IST

నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆదివాసీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. లంబాడాలను ఎస్టీ బాబితా నుండి తొలగించాలంటూ నినాదాలు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ లంబాడాలు ఎస్టీ జాబితాలోనే కొనసాగుతారని పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు. లక్ష్మణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనను పార్టీ నుండి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అధ్యక్ష హోదాలో ఉండి ఆదివాసీలను కించపరిచేవిధంగా మాట్లాడటం తగదన్నారు. పోలీసుల జోక్యంతో ఆదివాసీ నాయకులు రాస్తారోకో విరమించారు.

భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​పై ఆదివాసీల కన్నెర్ర..

ABOUT THE AUTHOR

...view details