నిజామాబాద్ నుంచి బాసర మార్గంలో ఎడపల్లి మండలం జానకంపేట నుంచి నవీపేట మండలం ఫకీరాబాద్ వరకు 14.45 కి.మీ.ల మేర నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి 50కోట్లు మంజూరయ్యాయి. 2017 మార్చిలో పనులు కూడా ప్రారంభించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 68 కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికి 56పూర్తి చేశారు. 10కి.మీ.ల వరకు మెటల్ రోడ్డు, 500 మీటర్ల వరకు బీటీ పనులు మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరు పరిశీలిస్తే గడువులోగా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రమాదాలు జరుగుతున్నా... పట్టించుకోని అధికారులు
బాసర... పేరు వినగానే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, సరస్వతిదేవి, గోదావరి గుర్తుకొస్తాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లేందుకు మాత్రం సరైన రోడ్డు లేదు. నిజామాబాద్- బాసర మార్గంలో నాలుగు వరుసల రహదారి నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా... పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల నుంచి సాగుతున్న ఈ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోగా ప్రయాణికుల పాలిట మృత్యుకూపంగా మారుతున్నాయి.
ప్రమాదాలు జరుగుతున్నా... పట్టించుకోని అధికారులు
ఇవీ చూడండి: అయోధ్య కేసులో నేటినుంచి రోజువారీ విచారణ