హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల (బి) గ్రామంలో ఎస్సీ సంఘనాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్ర వెళ్లే జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జీహెచ్‌ఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంజాగుట్ట చౌరస్తాలో యధావిధిగా విగ్రహ ఏర్పాటుకు అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి
పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ... ఎస్సీ సంఘాల నాయకులు నిర్మల్ జిల్లా కౌట్లలో కేంద్రంలో ఆందోళనకు దిగారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి