తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబాయ్​ నుంచి స్వస్థలానికి చేరిన యువకుడి మృతదేహం - నిర్మల్​ నేర వార్తలు

గత నెలలో దుబాయ్​లో ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహం స్వస్థలానికి చేరింది. ముథోల్​లోని కొలిగల్లి కాలనీకి చెందిన అశోక్​ మృతదేహం ఇంటికి వచ్చింది.

దుబాయ్​ నుంచి స్వస్థలానికి చేరిన యువకుడి మృతదేహం
దుబాయ్​ నుంచి స్వస్థలానికి చేరిన యువకుడి మృతదేహం

By

Published : Sep 22, 2020, 10:25 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్​లోని కొలిగల్లి కాలనీకి చెందిన ఓ యువకుడు గతనెల 31న దుబాయ్​లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన అశోక్ మృతదేహం మంగళవారం స్వస్థలానికి చేరింది. అశోక్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

గ్రామానికి చెందిన అశోక్ రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఏమైందో ఏమోగాని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. తండ్రి ఏడేళ్ల క్రితం మృతి చెందాడు. మృతదేహాన్ని దుబాయ్​ నుంచి రప్పించేందుకు ఎమ్మెల్యే విఠల్​ రెడ్డితో పాటు పలువురు ఆర్థిక సాయం చేశారు.

ఇదీ చూడండి:జీకే అన్నారం హత్య కేసులో వెలువడిన కీలక తీర్పు

ABOUT THE AUTHOR

...view details