తెలంగాణ

telangana

నకిలీ విత్తనాలతో మోసం చేశారు.. నన్ను ఆదుకోండి సార్​..!

రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ పత్తి విత్తనాలు విక్రయించి మోసం చేసిన ఏజెన్సీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్​ ఎదుట రైతు గుంజాల శెట్టి చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వారు సంఘీభావం తెలిపారు.

By

Published : Nov 10, 2020, 12:43 PM IST

Published : Nov 10, 2020, 12:43 PM IST

a farmer protest in front of nirmal collectorate
నకిలీ విత్తనాలతో మోసం చేశారు.. నన్ను ఆదుకోండి సార్​..!

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని కుస్లి గ్రామానికి చెందిన రైతు గుంజాల శెట్టి తనకున్న ఐదు ఎకరాలతో పాటు మరో 18 ఎకరాలను కౌలుకు తీసుకొని మొత్తం 23 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశానని తెలిపాడు. అయితే నాలుగు నెలలు దాటుతున్నా ఇంతవరకు పూతరాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణాన్ని ఆశ్రయించాడు. బీటీ పత్తి విత్తనాలు అమ్మకం జరిపిన ఏజెన్సీను వెళ్లి నిలదీయగా వారు పట్టించుకోవడం లేదని బాధిత కర్షకుడు వాపోయాడు.

నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయానని తెలుసుకుని.. తనకు న్యాయం చెయ్యాలంటూ జిల్లా కలెక్టర్​కు విన్నవించుకున్నాడు. అయినాా ఎటువంటి ఫలితం కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు పరిహారం చెల్లించాలంటూ కలెక్టరేట్​ ఎదుటే కుటుంబ సమేతంగా రిలే నిరాహార దీక్ష చేపట్టాడు. అతనికి తెలంగాణ రైతు సంఘం నాయకులు మద్ధతు తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన ఏజెన్సీపై పీడీ యాక్టు అమలు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'వరద బాధితులకు సాయం పంపిణీ చేయకపోతే కాలనీల్లో తిరగనివ్వం'

ABOUT THE AUTHOR

...view details