ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని 7 సహకార సంఘాల నామినేషన్ల పర్వం ముగిసింది. శనివారంతో గడువు ముగిసే సరికి మొత్తం 258 మంది అభ్యర్థులు నామ పత్రాలను దాఖలు చేశారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో 258 నామపత్రాలు దాఖలు
సహకార సంఘాల నామినేషన్ల స్వీకరణ శనివారంతో ముగిసింది. ఖానాపూర్ నియోజకవర్గంలోని 7 సహకార సంఘాలకు మొత్తం 258 మంది అభ్యర్థులు నామ పత్రాలను దాఖలు చేశారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో 258 నామపత్రాలు దాఖలు
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరులో 25, చింతగూడలో 31, సత్తెనపల్లిలో 34, ఇంద్రవెల్లిలో 17, కడెంలో 57, ఖానాపూర్‌లో 43 మంది సభ్యులు నామినేషన్లు వేసినట్టు అధికారులు పేర్కొన్నారు. నామినేషన్ల పర్వం ముగిసిందని ఈ నెల 15న పోలింగ్‌కు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా సహకార సంఘం అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం