తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముందు వీఆర్వోలు ధర్నా నిర్వహించారు. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలని కోరారు. జిల్లాలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. సమగ్ర భూ సర్వేలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన వీఆర్వో వ్యవస్థను మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వీఆర్వోలు కలెక్టర్కు అందజేశారు.
నారాయణపేటలో వీఆర్వోల ధర్నా - వీఆర్వోల ధర్నా
నారాయణపేట జిల్లాలోని వీఆర్వోలు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పాలానాధికారికి అందజేశారు.
వీఆర్వోల ధర్నా