ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు చేరడంలో అనేక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. నారాయణ పేట జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో వంట గదుల్లేక వంట ఏజెన్సీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్నిచోట్ల గదులు నిర్మించినా అవి వంట చేసేందుకు అనువుగా లేవు. కనీసం ఇద్దరు మనుషులు కూర్చునేందుకు... వంట పాత్రలు తీసుకెళ్లేందుకు కూడా వీలుగా లేవని సిబ్బంది వాపోతున్నారు.
18 ఏళ్లుగా ఆరుబయటే...
జిల్లా కేంద్రంలోని వైదిక పాఠశాలలో 18 ఏళ్లుగా ఏజెన్సీ నిర్వాహకులు ఆరు బయటే వంట చేస్తున్నారు. వర్షమొస్తే తమ తిప్పలు వర్ణణాతీతంగా ఉంటున్నాయని వాపోతున్నారు. దాతలెవరైనా స్పందించి వంట గదిని నిర్మించాలని కోరుతున్నారు.
దాతలెవరైనా సాయం చేయండి