నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లు నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నా... కొందరు అడ్డగోలుగా తిరుగుతున్నారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాన రహదారి మినహాయించి... మిగిలిన అన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ నిర్బంధం పాటించాలని... అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సీఐ శంకర్ సూచించారు.
బయటి వాళ్లు రాకుండా... లోపలి వాళ్లు వెళ్లకుండా - మక్తల్లో బారికేడ్లు
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మక్తల్ పట్టణం చుట్టూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దంటూ సూచనలు చేస్తున్నారు.
బయటి వాళ్లు రాకుండా... లోపలి వాళ్లు వెళ్లకుండా