నారాయణ పేట జిల్లా మక్తల్‌లోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్లో సోడా గ్యాస్ సిలిండర్ పేలి యువకుడు మృతి చెందాడు. పార్లర్లో సోడా తయారుచేసే క్రమంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భరత్ సింహా గౌడ్(24) అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.
సోడా గ్యాస్ సిలిండర్ పేలి యువకుడు మృతి - died news
సోడా తయారు చేస్తున్న క్రమంలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన నారాయణపేట జిల్లా మక్తల్‌లోని పాతబస్తీలో చోటుచేసుకుంది.
సోడా గ్యాస్ సిలిండర్ పేలి యువకుడు మృతి
ప్రమాద సమయంలో ఒక్కడే ఉన్నాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.