నారాయణపేట జిల్లాను ఓడీఎఫ్ జిల్లా స్థానంలో ఉంచాలని జూన్ 2 వరకు డీఆర్డీఏ సిబ్బందికి, పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవోలకు కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. గ్రామాలలో ప్రతి ఇంటికి శౌచాలయాలు నిర్మాణం పూర్తయ్యే విధంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలంటూ క్షేత్రస్థాయి సర్పంచులతో కలెక్టర్ ఎస్. వెంకట్రావు సమావేశం ఏర్పాటు చేశారు. పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా ఆయా శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడ ఆలస్యం జరిగినా.. అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు.
'నారాయణపేటను ఓడిఎఫ్ జిల్లా స్థానంలో ఉంచాలి' - నారాయణపేట
నారాయణపేట జిల్లాను ఓడీఎఫ్ జిల్లా స్థానంలో ఉంచాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. తమకు కేటాయించిన గ్రామాల్లో ఓడీఎఫ్ లక్ష్యాన్ని సాధించేలా పని చేయాలని సూచించారు.
ఓడీఎఫ్ జిల్లా చేయడంపై కలెక్టర్‌తో సమావేశం