నారాయణపేట జిల్లా కేంద్రంలో ఖరీఫ్ 2020 వ్యవసాయ కార్యచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానంపై అంజనా గార్డెన్స్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకుముందు నారాయణపేట మండలం జాజాపూర్‌లో రైతు వేదిక సదస్సుకు మంత్రులు భూమి పూజ చేశారు. సీఎం కేసీఆర్ రైతులను అభివృద్ధి పరచాలనే సంకల్పంతో వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చూట్టామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
'రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత వ్యవసాయ విధానం' - Excise Minister Srinivas Goud latest News
నారాయణపేట జిల్లాలోని జాజాపూర్‌లో రైతు వేదిక సదస్సు నిర్వహించారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని సూచించిందని మంత్రులు తెలిపారు.
రైతు వేదిక సదస్సులో పాల్గొన్న మంత్రులు
ఉమ్మడి రాష్ట్రాన్ని ఎక్కువ కాలం నడిపించిన కాంగ్రెస్ పార్టీ.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును నిర్మించేటప్పుడు తెలంగాణ నేతలు ఎందుకు అడ్డుకోలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలోకి మిడతలు రాకుండా ప్రత్యేక కమిటీ: సీఎం కేసీఆర్