వీసా గడువు తీరిపోవడం వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన ఓ యువకుడు.. తనను స్వదేశానికి రప్పించేందుకు సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన అజీమ్ 2008లో సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లాడు. రెండున్నరేళ్లు పనిచేసి సెలవుపై 2011లో స్వదేశానికొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వెళ్లిపోయాడు. అయితే తాను పనిచేస్తున్న యజమాని జీతం ఇవ్వక పోవడం వల్ల వేరే వ్యక్తుల వద్ద పనిచేశాడు. ఇంతలో వీసా గడువు ముగిసింది. స్వదేశానికి వచ్చేద్దామనుకుంటే అతడు పనిచేసిన మొదట యజమాని అడ్డుకుంటున్నాడు. తనను స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేస్తూ... వీడియో ద్వారా అజీమ్ కోరుతున్నాడు.
వీసా గడువు తీరి విదేశాల్లో చిక్కుకుపోయిన యువకుడు - తెలంగాణ తాజా వార్తలు
ఆర్థిక ఇబ్బందులతో సౌదీకి వెళ్లిన ఓ యువకుడు విసా గడువు ముగిసిపోవడం వల్ల స్వదేశానికి రాలేక ఇబ్బంది పడుతున్నాడు. తనను స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరుతున్నాడు.
వీసా గడువు తీరి విదేశాల్లో చిక్కుకుపోయిన యువకుడు
తమ కుమారుడుని స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని... మంత్రి కేటీఆర్‌కు అజీమ్ తల్లి ఖాజాబీ విజ్ఞప్తి చేసింది. తండ్రి, సోదరుడు మృతి చెందినా కడచూపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇదీ చూడండి:నాంపల్లి ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన