నారాయణపేట జిల్లా మక్తల్లో జక్లేర్ మీదుగా రైల్వే అధికారులు రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. దేవరకద్ర, మునీరాబాద్ రైల్వే లైన్ పనులు పూర్తయిన సందర్భంగా జక్లేర్ వరకు ఈ నెల 3, 4 తేదీల్లో ఉదయం నాలుగు గంటలకు ఒక రైలు వచ్చి పోయేది. అక్కడి నుంచి మక్తల్ వరకు 12 కిలోమీటర్ల మేర రైల్వే పనులు పూర్తయ్యాయి.
మక్తల్ రైల్వే లైన్ పూర్తి.. త్వరలో సర్వీసులు
నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో జక్లేర్ మీదుగా రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. మండల పరిధిలోని పలు రైల్వే లైన్ మరమ్మత్తు పనుల్లో భాగంగా ఏడాదిన్నర కిందట జక్లేర్ వరకు పనులు పూర్తయ్యాయి. అధికారులు పరిశీలనకు రానున్న నేపథ్యంలో జక్లేర్ నుంచి మక్తల్కి ట్రయల్ రన్ నిర్వహించారు.
మక్తల్ రైల్వే లైన్ పూర్తి.. త్వరలో సర్వీసులు
జక్లేర్ నుంచి మక్తల్ వరకు రైలు మార్గాన్ని పరిశీలించే నేపథ్యంలో ట్రయల్ రన్ వేశారు. ఉన్నతాధికారులు పరిశీలనకు రానున్న నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహించి లోపాలు లేకుండా సరి చూసుకున్నారు. మక్తల్ వరకు రైలు సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల వ్యాపారులు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి :40 మంది విద్యార్థులపై కత్తితో దాడి