తెలంగాణ

telangana

ETV Bharat / state

కబ్జాకోరుల నుంచి చెరువును కాపాడాలని వినతి - forgery sing

summary: చెరువు భూమిని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసినా... రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ నారాయణపేట జిల్లా లంకాల గ్రామస్థులు కలెక్టరేట్​ ముట్టడించారు.

కబ్జాకోరుల నుంచి చెరువును కాపాడాలని వినతి

By

Published : Jul 16, 2019, 1:25 PM IST

నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల గ్రామస్థులు కలెక్టరేట్​ ముట్టడించారు. గ్రామంలోని కూర చెరువును కొందరు ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేశారని ఆరోపించారు. 180 ఎకరాల భూమికి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించినా అధికారులు పట్టించుకోకపోడం... వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. రాజవంశీయులు 1981లో ప్రభుత్వానికి రాసిచ్చిన ఈ భూమిని కాపాడాలని జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందించారు.

కబ్జాకోరుల నుంచి చెరువును కాపాడాలని వినతి

ABOUT THE AUTHOR

...view details