తెలంగాణ

telangana

ETV Bharat / state

వసతి గృహాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలి - కేవీపీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురుమయ్య

నారాయణపేట జిల్లాలోని వసతిగృహాల్లో కనీస వసతులపై కేవీపీఎస్​ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. నాణ్యమైన భోజనం, మరుగుదొడ్లు, దుస్తులు అందించాలని కలెక్టర్​ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

వసతి గృహాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలి

By

Published : Aug 24, 2019, 12:09 AM IST

వసతి గృహాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలి
నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల వసతిగృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేవీపీఎస్​ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల కాస్మొటిక్​ ఛార్జీలు, పాఠశాల దుస్తులు, తదితర సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. తమకు రావాల్సిన నూనె, దుస్తులు, ప్లేట్లు, యూజర్​ ఛార్జీలు, నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్​ చేశారు. వార్డెన్లు విద్యార్థులకు వారానికి ఆరు గుడ్లు, పళ్లు తగ్గించి ఇవ్వటం వల్ల వారి ఎదుగుదల సరిగా ఉండదని కేవీపీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురుమయ్య అన్నారు. స్థానిక పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్​ బాలాజీకి వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details