ఇంటర్ ఫలితాలల్లో అవకతవకలు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. నారాయణపేట జిల్లా కొండపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థిని శిరీష ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేదు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపాంలో ఉన్న శిరీష.. ఇవాళ ఇంట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మంటల వేడికి తట్టుకోలేక ఇంటిపై నుంచి దూకి మృతి చెందింది. విద్యార్థిని మృతితో కొండపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కిరోసిన్ పోసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - TELANGANA INTER ISSUE
నారాయణపేట జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొంది. ఇంటర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించకపోవడం వల్ల మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
కిరోసిన్ పోసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య