తెలంగాణ

telangana

ETV Bharat / state

మక్తల్​ పురపాలిక పరిధిలో ఆక్రమణల తొలగింపు - మక్తల్​ వార్తలు

మక్తల్​ మున్సిపాలిటిలో ఫుట్​పాత్​లపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణల కారణంగా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్​ వివరించారు. భవిష్యత్తులో ఫుట్​పాత్​ల పై అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మక్తల్​ పురపాలక పరిధిలో ఆక్రమణల తొలగింపు
మక్తల్​ పురపాలక పరిధిలో ఆక్రమణల తొలగింపు

By

Published : Jul 17, 2020, 6:43 PM IST

నారాయణ పేట జిల్లా మక్తల్ పురపాలిక పరిధిలోని ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఫుట్​పాత్​ను ఆక్రమించి దుకాణాదారులు నిర్మించిన కట్టడాలను జేసీబీ సాయంతో తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ పావని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జనసంచారం అధికమవ్వడం, వాహనాలు రోడ్లపై ఎక్కువగా తిరుగుతున్న తరుణంలో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడుతోంది. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకే ఆక్రమణలు తొలగిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఫుట్​పాత్​ల పై అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details