జలదిగ్బంధంలో హిందూపూర్ - జూరాల
కృష్ణమ్మ ఉద్ధృతికి నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. నారాయణపూర్, ఆల్మట్టి జలాశయాల నుంచి భారీ ఎత్తున వరద నీరు చేరడం వల్ల మక్తల్, మాగనూరు, కృష్ణ మండలంలోని హిందూపూర్ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
hindupur at krishna mandal in narayanpet district drowned due to floods of krishna water
కృష్ణమ్మ ఉగ్రరూపానికి నారాయణపేట జిల్లాలోని ప్రధాన ఆలయాలు, ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. జలదిగ్బంధంలో చిక్కుకున్న హిందూపూర్ ప్రస్తుత పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు.
- ఇదీ చూడండి : జూరాలకు పోటెత్తుతోన్న వరద