30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని నారాయణపేట జిల్లా పాలనాధికారి వెంకటరావు పిలుపునిచ్చారు. స్థానిక అంజనా గార్డెన్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని.. గ్రామాల్లో పాడుబడిన ఇళ్లను, ఉపయోగంలో లేని బావులను పూడ్చి వేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ గ్రామాల్లో శ్రమదానం నిర్వహించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సూచించిన విధంగా పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని సూచించారు.
'గ్రామాల్లో పచ్చదనం.. పరిశుభ్రతే లక్ష్యం'
పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని నారాయణపేట కలెక్టర్ వెంకటరావు పిలుపునిచ్చారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్రామాల్లో పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం