తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఘనంగా ఏరువాక పౌర్ణమి సంబురాలు'

నారాయణపేట జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు ఏరువాక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణ రైతులు, ప్రజలు పండుగ సందర్భంగా ఘనంగా సంబురాలు జరుపుకున్నారు.

కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, చిన్నారులు

By

Published : Jun 18, 2019, 2:56 PM IST

నారాయణపేట పట్టణంలో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలను సోమవారం స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు తమ ఎడ్లకు రంగులు అద్ది అందంగా తయారు చేశారు. స్థానిక పండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర ఏటా నిర్వహించినట్టుగానే ఈసారి కూడా ఏరువాక పౌర్ణమి నిర్వహించారు.
పండుగ సందర్భంగా పిండి వంటలు చేసుకుని కాడేడ్లకు పూజలు చేశారు. ఉత్సాహంగా ఉండేందుకు నాటుసారా తాగించారు. సాయంత్రం కాడెద్దులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానిక మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఏరువాక సందర్భంగా ఘనంగా సంబురాలు జరుపుకున్న రైతులు, ప్రజలు

ABOUT THE AUTHOR

...view details