ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సూచించారు. నారాయణ పేట జిల్లాలోని మక్తల్, మాగనూరు, కృష్ణటై రోడ్డు, నర్వ మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే - ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణ పేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మక్తల్, మాగనూరు, కృష్ణటై రోడ్, నర్వ మండలాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
ఏ గ్రేడ్ రకం క్వింటాకు రూ.1,888, సాధారణ రకం క్వింటాకు రూ.1,868కు కొనుగోలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మక్తల్ మార్కెట్ యార్డు వద్ద నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన వే బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ వనజ, మార్కెట్ ఛైర్మన్ రాజేష్ గౌడ్, జడ్పీటీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.