తెలంగాణ

telangana

ETV Bharat / state

4 నెలల పసివాడికి కరోనా.. భయాందోళనలో ప్రజలు - జక్లేర్​ గ్రామంలో 4 నెలల బాబుకు కరోనా

నారాయణపేట జిల్లాలో నాలుగు నెలల పసివాడికి కరోనా సోకడం కలకలం రేపింది. ఆ బాలుడికి ఈ నెల 14న డోలారోహణం చేశారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల్లోని బంధువులు హాజరయ్యారు. దీంతో గ్రామ ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వారి వివరాలు సేకరిస్తున్నారు. అయితే బాబుకు కొవిడ్​ ఎలా సోకిందని విచారిస్తున్నారు.

4 నెలల పసివాడికి కరోనా.. భయాందోళనలో ప్రజలు
4 నెలల పసివాడికి కరోనా.. భయాందోళనలో ప్రజలు

By

Published : May 26, 2020, 11:09 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్​లో నాలుగు నెలల బాబుకి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. గ్రామంలో ఆ బాలుడు.. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్.. అనంతరం హైదరాబాద్​లోని నిలోఫర్ వైద్యశాలకు తరలించారు.

జ్వరం తగ్గక పోవడం వల్ల వైద్యులు పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ అని ధ్రువీకరించారు. హైదరాబాద్​లోని బాలుడితో కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారు. ఆ బాబుకి గ్రామంలో ఈ నెల 14న డోలారోహణం జరిగింది. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాలకు చెందిన బంధువులు హాజరైనట్లు తెలుస్తోంది.

ఆ బంధువుల వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులు, పోలీసు అధికారులు గ్రామంలో సందర్శించి విచారణ చేపడుతున్నారు. అయితే నాలుగు నెలల పసి బాలుడికి కరోనా పాజిటివ్ ఎలా వచ్చిందనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్

ABOUT THE AUTHOR

...view details