నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో కరోనా వైరస్ నియంత్రణకు అహర్నిశలు కృషిచేస్తున్న వివిధ రంగాల సేవకులకు లయన్స్క్లబ్ ప్రతినిధులు అన్నదానం నిర్వహించారు.
అహర్నిశలు కృషిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత అన్నదానం - రెవెన్యూ సిబ్బంది
నారాయణపేట జిల్లా పట్టణ కేంద్రంలో పారిశుద్ధ్య, ఆశా కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బందికి, అనాథలకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు అన్నం పొట్లాలు అందజేసి తమ సేవాగుణాన్ని చాటుకున్నారు.
అహర్నిశలు కృషిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత అన్నదానం
విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, అనాథలకు, ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల బంధువులకు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు పలువురికి అన్నం పొట్లాలను అందించారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ఇలానే ప్రతి రోజు అన్నదానం నిర్వహిస్తామని వారు తెలిపారు.
ఇదీ చూడండి:ఇది ఆయుధాలు వాడని యుద్ధం: రవిశంకర్