నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఉప్పర్‌పల్లిలో తెల్లవారుజామున మూడు జంటలు ఏకమయ్యాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ కదం తొక్కింది. ప్రభుత్వం తీసుకున్న జనతా కర్ఫ్యూ నిర్ణయాన్ని గౌరవిస్తూ నిర్ణయించిన ముహూర్తానికన్నా ముందే తాళి కట్టారు.
జనతా కర్ఫ్యూతో తెల్లవారుజామునే పెళ్లిళ్లు
ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూనే... ఎవరికీ ఇబ్బంది కలగకుండా వివాహం చేసుకున్నారు నారాయణపేట జిల్లా ఉప్పర్‌పల్లికి చెందిన ముగ్గురు వధూవరులు. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించనున్నందున ఉదయం 6గంటల కంటే ముందే కార్యక్రమం ముగించారు.
జనతా కర్ఫ్యూతో తెల్లవారుజామునే పెళ్లిళ్లు
గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో వివాహ తంతు నిర్వహించారు. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాలుగున్నరకు, ఐదున్నరకు, 5 గంటల 55 నిమిషాలకు మూడు జంటలకు పెళ్లి జరిపించారు. చట్టాన్ని గౌరవించి ఉదయం 6 గంటల లోపే వివాహం చేసుకున్నందుకు స్థానికులు అభినందించారు.