నారాయణపేట జిల్లాలోని భీవండి కాలనీలో భాజపా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భాజపా మహిళా మోర్చ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ శ్యాంసుందర్ గౌడ్ ఆధ్వర్యంలో పేదలకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చేందుకు తమ వంతు సాయం అందించాలని ప్రధాని పిలుపుపై పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు లక్ష్మీ శ్యాంసుందర్ గౌడ్ తెలిపారు.
నారాయణ పేటలో భాజపా ఆధ్వర్యంలో అన్నదానం - నారాయణ పేటలో పేదలకు ఆహారం పంపిణీ చేసిన భాజపా మహిళా రాష్ట్ర కార్యదర్శి
నారాయణపేట జిల్లాలో భీవండి కాలనీ ప్రజలకు భాజపా మహిళా మోర్చ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ శ్యాంసుందర్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. లాక్డౌన్ సమయంలో పేదలను ఆదుకోవాలని ప్రధాని పిలుపుపై సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు భాజపా నేతలు పేర్కొన్నారు.
నారాయణ పేటలో భాజపా ఆధ్వర్యంలో అన్నదానం
కాలనీలోని ప్రతి ఇంటికీ తిరిగి ఆహారం పంపిణీ చేసి... కరోనా వ్యాప్తి కట్టడి చర్యలను వివరించారు. అనవసరంగా బయటకు రావొద్దని... సామాజిక దూరం పాటించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని సూచించారు.
ఇవీ చూడండి: సీరియస్గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్