నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ మిషన్పై అధికారులతో కలెక్టర్ వెంకట్రావ్ సమీక్షించారు. మండలంలో కేవలం 57 శాతం మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం జరగడంపై... ఎంపీడీవోను ప్రశ్నించారు. పది రోజుల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు చేపట్టని వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశానికి హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీస్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రఘవీరారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయానంద్ పాల్గొన్నారు.
మరుగుదొడ్ల నిర్మాణం చేయకుంటే పథకాలు బంద్..! - makthal
నారాయణపేట జిల్లా మక్తల్ ఎంపీపీ కార్యాలయంలో స్వచ్ఛభారత్ మిషన్పై కలెక్టర్ వెంకట్రావ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్మాణం చేయనివారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని ఆదేశించారు.
మరుగుదొడ్ల నిర్మాణం చేయనివారికి పథకాలు నిలిపేయండి