నారాయణపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, మిషన్ భగీరథ కింద కోటకొండ, పేరపళ్ల, ఊటకుంట గ్రామాల్లో తాగు నీరు రావట్లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు అనుమతించాలని కలెక్టర్‌ను కోరారు. సింగారం గ్రామస్థులు తమ గ్రామంలో నివాసం లేని 160 మంది పేర్లు ఓటరు లిస్టులో ఉన్నందున వాటిని తొలగించాలని కోరారు.
'కలెక్టర్ గారు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించండి' - MISSION BAGHIRATHA
నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలకు తాగు నీరు రావట్లేదని వివిధ గ్రామాల సర్పంచ్‌లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
గ్రామంలో నివాసం లేని 160 మంది పేర్లు తొలగించండి : గ్రామస్థులు