తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిహారం కోసం ఆందోళన.. హామీ ఇచ్చిన కలెక్టర్

నారాయణపేట జిల్లాలో మట్టి దిబ్బ కూలిన ఘటనలో బాధిత కుటుంబాలు న్యాయం కోసం రోడ్డెక్కాయి. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహాలతో రోడ్డుపై బైఠాయించి పరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తాం : కలెక్టర్

By

Published : Apr 10, 2019, 10:15 PM IST

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరులో మట్టిదిబ్బ కూలి పదిమంది మృతి చెందారు.వ ఈ ఘటనలో పరిహారం చెల్లించాలని కోరుతూ రహదారిపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ధర్నాతో రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. స్పందించిన జిల్లా కలెక్టర్ ఒక్కో కుటుంబానికి 5లక్షల పరిహారం ప్రకటించారు.

అర్హులకు కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం

బాధిత కుటుంబ సభ్యుల్లోని విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ఉచిత ప్రవేశం, అర్హులైన వారిలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామన్నారు. అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అర్హులైన కుటుంబాలకు మూడెకరాల భూమి అందజేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. శాంతించిన బాధిత సభ్యులు ఆందోళన విరమించి మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్ళారు.

ఒక్కో కుటుంబానికి 5లక్షల పరిహారం ప్రకటించిన జిల్లా కలెక్టర్

ఇవీ చూడండి : తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం: దాసోజు

ABOUT THE AUTHOR

...view details